Tuesday, January 7, 2025

MBNR | పాలిటెక్నిక్ బాలికల బాత్రూంలో కెమెరా.. నిందితుడి అరెస్ట్!

సీఎంఆర్ ఇంజినీరింగ్ క్యాంపస్‌లోని బాలికల హాస్టల్‌లోని వాష్‌రూమ్‌లో రహస్యంగా కెమెరా పెట్టి వీడియోలు తీశారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అయితే ఆ ఘటన సద్దుమణగకముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.

మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల బాత్ రూమ్ లో మొబైల్ కెమెరాలు పెట్టి రహస్యంగా వీడియోలు రికార్డు చేసిన ఘటన కలకలం రేపింది.

ఈ ఘటనపై కాలేజీ విద్యార్థినులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు.

ఈ దుశ్చర్యకు పాల్పడిన సిద్ధార్థ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇతనొక్కడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడా.. ముఠా ఏదైనా ఉందా.. విద్యార్థినుల వీడియోలను వేరొకరికి పంపాడా.. సోషల్ మీడియాలో ఏమైనా అప్‌లోడ్ చేశాడా.. అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement