Friday, November 22, 2024

వేలం పాట..

దేవరకద్ర : మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద పోలీస్‌ బందోబస్తు మధ్యన పశువుల సంత వేలం పాటలను అధికారులు నిర్వహించారు. వేలం పాటలు ప్రారంభం కాగానే పాటదారులు మధ్య వాగ్వివాదం జరిగింది. గతంలో కొందరు పాటదారులు అధికంగా వేలం పాటలు పాడి గ్రామపంచాయితీకి డబ్బులు కట్టలేదని మరి వాళ్ల సంగతి ఏమిటని వేలం పాటలో పాల్గొన్న బిట్టర్ల అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి విషయాలు గ్రామ సభలోనే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని అప్పుడు ఏమి పని చేశారని మరికొందరు పాటదారులు వారిని నిలదీశారు. అలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడకూడదని అధికారులు బిట్టర్స్‌ సూచించారు. వెంటనే అధికారులు వేలం పాటలు నిర్వహించారు. దేవరకద్ర పశువుల సంతను పట్టణానికి చెందిన దొబ్బలి ఆంజనేయులు అనే వ్యక్తి పాట పాడి రూ.70 లక్షల ఒక వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు. అలాగే తైబజార్‌ వేలం ను పట్టణానికి చెందిన వెంకట్రాములు అనే వ్యక్తి 7 లక్షల 22 వేల రూపాయలకు పాట పాడి దక్కించుకున్నారు. అలాగే గొర్రలె మేకల సంత వేలంను పట్టణానికి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి 10లక్షల 5 వేల ఐదు వందల రూపాయలకు పాట పాడి దక్కించుకున్నారు. గత సంవత్సరం కన్నా ఈ సారి గ్రామ పంచాయితీకి ఆదాయం పెరుగుతుందని అధికారులు అంటున్నారు. వేలం పాటలో డిఎల్పిఓ వరల క్ష్మి , ఎంపిడిఓ శ్రీనివాస్‌ రెడ్డి, స్థానిక సర్పంచ్‌ కొండ విజయలక్ష్మి , సిఐ రజితరెడ్డి, గ్రామపంచాయితీ ఈఓ వనతి , స్థాని క ఎస్‌ఐ భగవంత రెడ్డి, చిన్నచింతకుంట ఎస్‌ఐ లక్ష్మిరెడ్డి , గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు గ్రామపంచాయితీ సిబ్బంది పాటదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement