దేవరకద్ర : మండల పరిధిలోని చిన్నరాజమూరు , గోటూరు మధ్యలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరారు. రెండు గ్రామాల మధ్యలో బ్రిడ్జి లేకపోవడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వారు మంత్రికి వివరించారు. బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.15 కోట్లు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే లు ,మంత్రిని కోరారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు
Advertisement
తాజా వార్తలు
Advertisement