Thursday, November 21, 2024

కాంగ్రెస్ పార్టీపై కావాలనే బీజేపీ ఈడీ కుట్ర : భట్టి విక్రమార్క

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే అక్రమ కేసులు పెట్టి ఈడీ కార్యాల‌యానికి పిలిపించి విచార‌ణ పేరిట వేదింపుల‌కు పాల్ప‌డుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాల‌యం ఎదుట జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేప‌ట్టిన నిర‌స‌న కార్యాక్ర‌మానికి ముఖ్యఅతిథిగా భట్టి విక్రమార్క హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ… దేశంలోని మొదటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నియంత పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. 80 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి దేశాన్ని తాకట్టు పెట్టిన మోడీ, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement