Friday, November 22, 2024

MBNR: ప్రచారంలో స్పీడ్ పెంచిన బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల (ప్రతినిధి) నవంబర్ 21 (ప్రభ న్యూస్) : గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. గద్వాల్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి జనాలు జేజేలు కొడుతున్నారు. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల పరిధిలోని మార్లబీడు, జిల్లడబండ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఎన్నికల ప్రచారంలో వివరిస్తూ ప్రజల మధ్యకు వెళుతున్నారు.

సీఎం కేసీఆర్ నూతన మేనిఫెస్టోలో రైతులకు మహిళలకు బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ నూతన మేనిఫెస్టోలో రైతుబంధు 12వేల రూపాయలు అదేవిధంగా ఆసరా పింఛన్ రూ.3,016 పెంచుతూ ప్రతి ఏడాది 500 రూపాయలు పెంచుతూ 5000 రూపాయల వరకు, అదేవిధంగా మహిళలకు 3,016 రూపాయలు, గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే, తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళకు సన్నబియ్యం 93లక్షల కుటుంబాలకు ఆరోగ్య భీమా రైతు బీమా తరహాలోని మరణించిన వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ప్రపంచంలోనే నిర్ణయించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను, తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement