Saturday, January 4, 2025

MBNR | తెలుగు పత్రికా రంగంలో ఆంధ్రప్రభది సుస్థిర స్థానం

2025 వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించిన చేసిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి ప్రతినిధి, డిసెంబర్ 30 (ఆంధ్ర ప్రభ) : భారత స్వాతంత్ర పోరాటంలో ఆంధ్రప్రభ దినపత్రిక తనదైన పాత్ర పోషించిందని మాజీ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాస గృహంలో ఆంధ్రప్రభ దినపత్రిక- 2025 వార్షిక క్యాలెండర్ ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈసందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… లక్షలాది మంది పాఠకుల నుంచి విశేష ఆదరణ పొందడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా ఆంధ్రప్రభ ముందు వరుసలో ఉందన్నారు. అందువల్లే ఆంధ్రప్రభ పాఠకుల మదిలో సుస్థిర స్థానం పొందిందన్నారు. ఈసందర్భంగా ఆంధ్రప్రభ వనపర్తి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బోడ్డుపల్లి లక్ష్మణ్, పత్రిక రిపోర్టర్లకు నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ టౌన్ రిపోర్టర్స్ రామ కృష్ణారెడ్డి, బండారు గోపాల్, క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రముఖులు మున్సిపల్ మాజీ ఛైర్మెన్ రమేష్ గౌడ్, మాజీ వైస్ ఛైర్మెన్. వాకిటి శ్రీధర్, మున్సిపల్ కౌన్సిలర్లు నాగన్న యాదవ్, బండారు కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గులాం ఖాదర్, స్టార్ రహీం, మాధవ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కురుమూర్తి యాదవ్, మాణిక్యం, చిట్యాల రాము, కొమ్ము శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement