Thursday, December 19, 2024

TG | ఆంధ్రప్రభ 80 ఏళ్ల వారధి : ఎమ్మెల్యే యేన్నేం

ఆంధ్రప్రభ మహబూబ్నగర్ : నాడు 80 ఏళ్ల క్రితమే ఎలాంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో లేకపోయినా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఆంధ్రప్రభ దినపత్రిక అక్షర సత్యం వాస్తవాల కోణంలో విశ్లేషణ చేస్తున్న పత్రికగా పేరు గాంచిందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్నెం శ్రీనివాసరెడ్డి కొనియాడారు.

ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రభ ఉమ్మడి జిల్లా బ్యూరో ఇన్చార్జి గోవర్ధన్ గౌడ్, స్టాఫ్ రిపోర్ట్ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రభ 2025 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వము ప్రజలకు మధ్య 80 ఏళ్ల సుదీర్ఘ దినపత్రికగా నిజమైన వార్తల కేంద్ర బిందువుగా ఆంధ్రప్రభ వెలుగుతోందని ప్రశంసించారు. నాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలను, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మకమైన కథనాలను ప్రచురించి సామాజిక ప్రజా శ్రేయస్సులో ఆంధ్రప్రభ పత్రికా రంగంలో అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ ఫోటోగ్రాఫర్ వెంకటరమణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, ప్రచార కార్యదర్శి సి. జె బెనహర్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement