Wednesday, January 1, 2025

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఆంధ్ర ప్రభ….

  • “ఆంధ్ర ప్రభ క్యాలెండర్” ఆవిష్కరణ చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు డి. నారాయణ

వనపర్తి ప్రతినిధి, డిసెంబర్29(ఆంధ్ర ప్రభ): ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఆంధ్రప్రభ దినపత్రిక పనిచేస్తుందని… ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు ప్రభుత్వ దృష్టి వైపు తీసుకెళ్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు డి.నారాయణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన” ఆంధ్ర ప్రభ దినపత్రిక “నూతన సంవత్సరo-2025 వార్షిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికతను ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు వార్తలు పాఠకులకు అందిస్తూ వారి మదిలో ఆంధ్ర ప్రభ చురగొన్నదని అన్నారు. విశ్లేషణమైన కథనాలు,మానవీయ కోణంలో రాసే వార్తలతో ప్రజల మన్ననలు పొందుతుందని.. ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురించే వార్తలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.

ఈ ఆవిష్కరణలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి. రామన్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి. పెద్ది రాజు,అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బచ్చురాం, ప్రధాన కార్యదర్శి. సుగూరురాము, ఆంధ్రప్రభ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బి లక్ష్మణ్, వనపర్తి టౌన్ రిపోర్టర్స్. జి.రామకృష్ణారెడ్డి, బండారు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement