Friday, November 22, 2024

MBNR: బడి ఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలి… ఎమ్మెల్యే శ్రీహరి

మక్తల్, జూన్ 6 (ప్రభ న్యూస్) : బడిఈడు పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఇవాళ మక్తల్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన బడిబాట ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ అంగన్వాడీ టీచర్లు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లు పంచాయతీ సెక్రెటరీ లకు ఎమ్మెల్యే ఆదేశించారు.


ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తల్లిదండ్రులకు వీటి గురించి వివరించి చెప్పాలని తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ ప్రణాళిక ప్రకారం జూన్ 6వ తేదీ నుండి 19 తేదీ వరకు ప్రతిరోజూ ప్రతి గ్రామంలో అధికారులతో పాటు పాఠశాల కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఇంటిని సందర్శించి బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య, జిహెచ్ఎం, నోడల్ అధికారి అనిల్ గౌడ్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement