తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, సాగునీరు వచ్చి పంటలు పండుతుండడంతో భూముల ధరలు అమాంతంగా పెరిగాయి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన మినీ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో భూములు ఉన్నా నీళ్లు. కరెంట్, పెట్టుబడికి డబ్బులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అదే భూమికి ఉచితంగా సాగునీరు, కరెంట్, సాగుకు రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతుబీమా పథకం కూడా అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో రాష్ట్రంలోని ప్రతి ఎకరా సాగవుతున్నది.
Advertisement
తాజా వార్తలు
Advertisement