పేదల కోసం పోరాడిన గొప్ప యోధుడు పండుగ సాయన్న అని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని వీరన్నపేటలో ఉన్న పండుగ సాయన్న దేవాలయంలో పండుగ సాయన్న జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని విగ్రహ ప్రతిష్ట చేశారు. ధనవంతులతో పోరాడి పేదలకు సాయం చేసిన తెలంగాణ రాబిన్ హుడ్ ను స్మరించుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
పండుగ సాయన్న వారసులకు అన్ని విధాలా అండగా ఉంటామని… పండుగ సాయన్న ఖ్యాతిని మరింతగా పెంచే బాధ్యత తమపై ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కెమ్ జనార్దన్, విక్రమ్ దేవ్, టీఆర్ఎస్ వి జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, శివరాజు, దోమ పరమేష్, తదితరులు పాల్గొన్నారు.