అచ్చంపేట, జులై 16, ప్రభ న్యూస్ : మా దుకాణం ముందే వున్న మొక్కే కదా అని ఎదుగుతున్న చెట్టును నరికినందుకు మున్సిపల్ అధికారులు దుకాణదారుల నుండి 4 వేల రూపాయల ఫెనాల్టీని వసూళ్లు చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మున్సిపాల్టీ పరిధిలో చోటు చేసుకుంది. ఇవాళ అచ్చంపేట పట్టణంలోని మండల పరిషత్తు కార్యాలయం ఎదురుగా నున్న విజయ డ్రెస్సెస్ అండ్ అనూష లేడిస్ కార్నర్ ముందు హరితహారంలో భాగంగా నాటిన మొక్క ఎదుగుతున్న క్రమంలో దుకాణాలకు కొమ్మలు అడ్డంగా వున్నాయని చెట్టును సగానికి అడ్డంగా నరికారు.
విషయం తెలుసుకున్న మున్సిపాల్టీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దుకాణదారులకు 4 వేల రూపాయల ఫెనాల్టీ విధించారు. కాగా చెట్టును నరికించిన వ్యాపారస్తుడు షాపులో పనిచేస్తున పర్వతాలు అనే గుమాస్తాతో 2 వేల రూపాయలు ఆ ఫెనాల్టీ డబ్బులను కట్టించడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, వార్డు ఆఫీసర్లు శంకర్, పార్థ, ఆహ్మద్, నిరంజన్, బిల్ కలెక్టర్లు శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.