Friday, November 22, 2024

MBNR: మార్చికి గద్వాలలో 300పడకల ఆసుపత్రి.. ఎమ్మెల్యే బండ్ల

గద్వాల (ప్రతినిధి) డిసెంబర్ 11 (ప్రభ న్యూస్) : వచ్చే ఏడాది మార్చి నాటికి గద్వాల ప్రజలకు 300 పడకల ఆస్పత్రి సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని దౌదర్ పల్లి సమీపంలో నిర్మిస్తున్న 300 పడకల ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై కాంట్రాక్టర్ తో ఎమ్మెల్యే మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో రూ.39 కోట్లతో గద్వాల ప్రాంతంలో 300 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రి పనులు సుమారు 90% పూర్తి కావడం జరిగిందని, మిగతా పనులను ఇటీవల ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహా సహకారంతో వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తి చేసి గద్వాల ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

గద్వాల నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో తనను మరొక్కసారి ఆశీర్వదించినందుకు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేవిధంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ దౌలు, నరహరి శ్రీనివాసులు, నాగిరెడ్డి, శ్రీను, నరహరి గౌడు, కృష్ణ, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు, ఉపాధ్యక్షులు ధర్మ నాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేష్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ నాయుడు, కోటేష్, నాగులు యాదవ్, సతీష్, రిజ్వాన్, కురుమన్న, బంగి సుదర్శన్, మోబీన్, గంజిపేట రాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement