దేవరకద్ర : మండల కేంద్రంలో వేసవి కాలంలో అమ్మడానికి పేదోడి ఫ్రిజ్‌లు సిద్దంగా ఉన్నాయి. పట్టణానికి చెందిన కుమ్మరి కులస్థులు మట్టి కుండలను తయారు చేస్తున్నారని రామచంద్రయ్య తెలిపారు. ఒక్కొక్క కుండా తయారు చేయడానికి వారం రోజులు సమయం పడుతుందని ఆయన చెప్పారు.ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పేదోడి ఫ్రిజ్‌లు అమ్మడానికి సిద్దంగా తయారు చేయడం జరిగిందని , ఒక్కొక్క దానికి ధరలు నూరు రూపాయల నుండి మొదలుకొని నూటయాభై రూపాయల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ విక్రయాలు కొనసాగుతాయని , వేసవి కాలంలో ఈ మట్టి కుండలు తీసుకుంటే నీరు తాగడానికి చల్లగా ఉంటుందని ఆయన తెలిపారు. పాత బస్టాండ్ , కొత్త బస్టాండ్ ఏరియాలో ఈ మట్టి కుండలను విక్రయించడం జరుగుతుందని ఆయన చెప్పారు. మూడు నెలల వరకు ఈ మట్టి కుండలు విక్రయించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement