మహబూబ్‌నగర్ : పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని సిపిఐ పట్టణ కార్యదర్శి బి.చంద్రకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జడ్చర్ల నుండి రాయిచూర్ వెళ్లే రహదారి విస్తరణ పనులలో జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ రహదారి పనులు ముందుగా 120 ఫీట్ల రోడ్డు విస్తరణ ను చేస్తామని తెలిపిన జిల్లా అధికారులు దాన్ని 100 ఫీట్లకు కుదించి , అది కూడా కొలతల ప్రకారం లేకుండా అడ్డదిడ్డంగా పనులు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా పట్టణం నడిబొడ్డులోని అశోక్ టాకీస్ చౌరస్తా నుండి వన్‌టౌన్ వరకు నిర్వహిస్తున్న పనులలో పాత రోడ్డు పైనే కొత్త రోడ్డు వేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. పట్టణంలో రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , కనుక ఈ విషయంపై జిల్లా కలెక్టర్ , స్థానిక మంత్రి వర్యులు చొరవ తీసుకుని కొలతల ప్రకారం నాణ ్యత తో కూడిన రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement