నాగర్‌కర్నూల్ : మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఓటుకు 1500, 1000 రూపాయల చొప్పున డబ్బులు పంపిణీ చేసిందని నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పంపిణీ జరిగిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్థన్‌రెడ్డి ఆరోపించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగం జనార్థన్‌రెడ్డి మాట్లాడారు.పట్టభద్రుల ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తగిన గుణపాఠం చెప్పుతారని తాను భావిస్తున్నానని కాంగ్రెస్‌పార్టీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నదని అన్నారు. టిఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల పట్టభద్రులు ఊహించని మార్పు చేస్తారని అన్నారు. నాగర్‌కర్నూల్ శాసన సభ్యుడు వచ్చాక భూ దొంగలు పడ్డారని ల్యాండ్ మాఫీయా తయారైందని ఆరోపించారు. నెల్లికొండ సమీపంలో 363 సర్వేనెంబర్ తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆ భూములలో సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇచ్చామన్నారు. ఆభూమిలో ఆంజనేయస్వామి గుడి పేరిటా 5ఎకరాలు మిగిలిందని అన్నారు. నాగర్‌కర్నూల్ కొత్త వ్యవసాయ మార్కెట్‌కు మార్చాలనే నిర్ణయం ఎమ్మెల్యే, జక్కారఘునందన్‌రెడ్డి చేశారని వ్యాపారస్తులను భయపెట్టి నాలుగైదు ఎకరాలు తక్కువ ధరకు 350 గజం చొప్పున ఎమ్మెల్యేకు బినామీలు అయిన శ్యాంసుందర్, కౌన్సిలర్ ఇసాక్‌ల కు మూడున్నర ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ మార్కెట్ వ్యాపారుల సంఘం అద్యక్షుడు చేశారని నాగం వివరించారు. ఈ భూమి వివాదంలో పార్టు -బి లో ఉండగా రిజిస్ట్రేషన్లు ఎలా అవుతాయని నాగం ప్రశ్నించారు. ఈ వ్యాపారస్తులు కొన్న స్థలంలో ప్లాటింగ్ చేయడం వల్ల అవి అమ్మకం కోసం మార్కెట్‌ను కొత్త మార్కెట్ మార్చారని నాగం ద్వజమెత్తారు. రైతులు వ్యాపారుల ప్రయోజనకోసం చెప్పుతున్నారు కాని వాస్తవంగా భూబకాసురుల కోసం చేశారని నాగం ఆరోపించారు. ఈ భూ మాఫియాపై జి ల్లా కలెక్టర్ విచారణ చేయాలని నాగం జనార్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కృష్ణా జలాలను ఆంధ్రకు తరలిస్తున్నా అరికట్టడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం వైపల్యం చెందిందని నాగం విమర్శించారు. ప్రాజెక్టులలో అవినీతి గురించి పాలమూరు- రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల గురించి బయట పెట్టానని అన్నారు. కృష్ణాజలాల పరిరక్షణకై మండల స్థాయిలో పర్యటించి దీనిపై ఉద్యమిస్తానని నాగం జనార్థన్‌రెడ్డి తెలిపారు. నాగర్క ర్నూల్ నియోజకవర్గంలో రియల్ మాఫీయా చేస్తున్న ఆక్రమణలపై సహించేది లేదని దీనిపై గ్రీన్ ట్రిబినల్లో , హైకోర్టులో కేసులు వేయడం జరిగిందని అయిన కూడా రియల్ మాఫీయా తన కార్యకాలాపాలను కొనసాగిస్తున్నదని దీనిని జిల్లా కలెక్టర్ ఎందుకు ఆరికట్టడం లేదని ప్రశ్నించారు. ఈ సమస్యలపై కూడా రాబోయే కాలంలో ఉద ్యమాలు చేస్తానని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎంపిపి కోటయ్య, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, మాజీ సింగిల్‌విండో చైర్మన్ తిమ్మాజీపేట పాండు, నాయకులు అర్జునయ్య, నాగులయ్య తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————
కృష్ణాజలాల పరిరక్షణకై ఉద్యమిస్తాం..
Advertisement
తాజా వార్తలు
Advertisement