Saturday, November 23, 2024

ఇదేమి దుమ్ము బాబోయ్..


దేవరకద్ర : మండల కేంద్రంలో స్థానిక పాత బస్టాండ్‌ వద్ద సర్వీస్‌ రోడ్డు పూర్తిగ దుమ్ము ధూళి ఉండటంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదేమి దుమ్ము బాబోయ్‌ అంటూ వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్‌ఓబి పనులు జరుగుతున్నందుకు తాత్కాలికంగా పక్కకు అధికారులు సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేశారు. రోడ్డు వేశారు కానీ దానిపై నీరు కొట్టేది పూర్తిగా అధికారులు మర్చిపోయారు. వాహనాల రాకపోకలు జోరుగా సాగుతున్నాయి. దాని వల్ల దుమ్ము ధూళి ఎక్కువ ఉండటం వల్ల వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నారు. పెద్ద పెద్ద వాహనాల వెంట వెళ్లాలంటేనే వాహనదారులు ఆ దుమ్ము ధూళికి నానా తంటాలు పడుతున్నారు. ఇటీవల ఆ దుమ్మూ ధూళి కారణంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొంత మంది వ్యాపారులు ఆసుపత్రికి గురి కావడం జరిగింది. దుమ్ము ధూళి ఎక్కువగా ఉన్నందుకు దగ్గు , జలుబు తదితరులు వ్యాథులు వస్తున్నాయని వాహనదారులు అంటున్నారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వాహనదారులు , వ్యాపారస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వీస్‌ రోడ్డుపై దుమ్ము థూళి లేవకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు నీరు చల్లే విధంగా చర్యలు తీసుకుని వాహనదారులు , వ్యాపారుల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారులు స్పందించాలి : కొండ అంజన్‌ కుమార్‌ రెడ్డ
మండల కేంద్రంలో స్థానిక పాత బస్టాండ్‌ వద్ద దుమ్ము ధూలిపై అధికారులు వెంటనే స్పందించాలని మండల బిజెపి అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌ రెడ్డి కోరారు. దుమ్ము ధూళి విపరీతంగా ఉండటం వల్ల వాహనదారులురోడ్లపై వెళ్లాలంటేనే అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే సర్వీస్‌ రోడ్డు చేశారే కానీ దానిపై ఉన్న దుమ్ము గురించి మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. అధికారులు వెంటనే స్పందించి సర్వీస్‌ రోడ్డుపై దుమ్ము ధూళి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement