Wednesday, January 1, 2025

హ‌త్యా బాధిత కుటుంబానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప‌రామ‌ర్శ‌.

మహబూబ్‌నగర్‌: స్థానిక‌ భగీరథ కాలనీ సమీపంలో ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు నరహరి గ‌త రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగుటు నరహరిని గొంతుకోసి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి నరహరి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. అయినా అతడు మృతిచెందక పోవడంతో కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అయితే నరహరి స్నేహితుడితో ఉన్న ఆర్ధిక త‌గ‌దాలే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు.. హ‌త్య జ‌రిగిన విష‌యం తెలుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధిత కుటుంబం ఇంటికి వెళ్లారు.. మృతురాలి భార్య‌ను ప‌రామ‌ర్శించారు.. ఆమెకు ధైర్యం చెప్పారు.. నిందితుల‌ను ప‌ట్టుకుని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని భరోసా ఇచ్చారు.
.

Advertisement

తాజా వార్తలు

Advertisement