Sunday, November 24, 2024

Mahabubabad Review – కాంగ్రెస్ అబ‌ద్దాల ముందు కెసిఆర్ అభివృద్ధి ఓడిపోయింది – కెటిఆర్

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు కెసిఆర్ చేసిన అభివృద్ధి ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే బీఆర్ఎస్ గెలిచేదని అన్నారు. తెలంగాణ భ‌వ‌న్ లో నేడు జ‌రిగిన మహబూబాద్ పార్లమెంట్ నియోజకర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ. వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ హయాంలో అమలు చేసినా, ఏనాడు కూడా ప్రజలను లైన్లలో నిలబెట్టలేదని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యమే చూసామే కానీ రాజకీయ ప్రయోజనం, రాజకీయ ప్రచారమే గురించి ఏనాడు ఆలోచించలేదని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను పూర్తిగా తిరస్కరించలేదని అన్నారు.

అనుబంధ సంఘాల‌ను బ‌లోపేతం చేస్తాం ..

బీఆర్ఎస్ పార్టీకి మూడో వంతు సీట్లు 39 వచ్చాయి. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్ల తోనే జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ మనకు తేడా కేవలం 1.85 శాతం అన్నారు. పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుంటామని అన్నారు. అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తామని తెలిపారు. పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. గిరిజనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్ తో పాటు.. పొడు భూముల పట్టాల పంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలు అనేక కార్యక్రమాలను మన ప్రభుత్వం గతంలో అందించిందన్నారు. అయినా గిరిజనం ఎక్కువ ఉన్న చోట్లకూడా ప్రజలు పూర్తి మద్దతు మనకివ్వలేద‌ని అంటూ ఇలాంటి వాటన్నింటి సమీక్ష చేసుకుని ముందుకుపోతామన్నారు.

కాంగ్రెస్ లో ఎవ‌రికి వారే య‌మునా తీరే – క‌డియం ..

ఇక మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో ఎవరికి వారే యమునా తీరే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చే పరిస్థితి ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ,హరీష్ రావు లు కృష్ణార్జునులు వారు కలిసికట్టుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కోరారు. కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు,, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, స‌త్య‌వ‌తి , మాజీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్, ఎంపి క‌విత మాలోత్ , మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement