మహబూబాబాద్ – తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పోలీసులు సమర్పించిన గౌరవ వందనాన్నిస్వీకరించారు. దీనిలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మంత్రి గారు ప్రశంసాపత్రాలు అందజేశారు..అలాగే అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్ధుల ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలను తిలకించారు.. తెలంగాణ సాధించిన ప్రగతిని, అమలు చేస్తున్నపథకాలను మంత్రి వివరించారు..
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, జిల్లా జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, ఎంపీ మాలోత్ కవిత, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.