Tuesday, November 26, 2024

Telangana: మహా మాయగాడి క్రైమ్​ కహాని.. హాస్పిట‌ల్స్ పేరుతో భారీగా వ‌సూళ్లు

వరంగల్ క్రైమ్‌, (ప్రభన్యూస్‌): పైసా పెట్టుబడి లేకుండా మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకొనే ఎత్తులు వేశాడో పోస్ట్‌ గ్రాడ్యుషన్‌ చేసిన విద్యావంతుడు. పైగా ప్రస్తుత టెక్నాలజీపై మంచి పట్టు-ంది. దాంతో గతంలో క్రిస్టియన్‌ మిషనరీ ఆర్గనైషన్స్‌లో పనిచేసిన అనుభవం, దానికి తోడు తన తండ్రి నడిపిన హాస్పిటల్‌ ఫీల్డ్‌పై ఉన్న పట్టు-తో మరో ప్రపంచాన్ని సృష్టించే స్కెచ్‌ వేసి అమలు పరుస్తున్నాడు. గతంలో చేసిన మోసాలు బయటపడకుండా పక్కా ప్లాన్‌ వేసి ఓరుగల్లులో స్థిరపడాలని వేసిన పథకం చిన్న తప్పిదంతో బెడిసికొట్టింది. దాంతో రంగంలోకి దిగిన వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ మహా మాయగాడి మొత్తం బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.

టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి చెందిన కేటుగాడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో చెలామణి అవుతూ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నాడు. అదీగాక ఎక్కడా తన పేరు, ఫొటోలతో అనుమతుల కోసం దరఖాస్తు చేయకుండా, లోకల్‌లో ఉన్న పేదవారికి ఆశలు కల్పించి వారి పేర్లతో దందా చేసే ఎత్తులు వేసిన మహా మాయగాడైన ఎలియస్‌ జెస్సిమెన్‌ అలియాస్‌ పీటర్‌ అలియాస్‌ మాథ్యూస్‌ అలియాస్‌ పర్కార్‌(56)ను అరెస్ట్‌ చేశారు. వరంగల్‌ నగరంలోని కాశీబుగ్గను కేంద్రంగా చేసుకొని అమాయకుల వద్ద హాస్పిటల్స్‌లో పెట్టు-బడి పేరుతో పాటు, మెడికల్‌ షాప్స్‌, ల్యాబ్‌ల ఏర్పాటు పేర్లతో సుమారు 40 లక్షల రూపాయలు వసూళ్ళు చేశాడు.

కాశీబుగ్గ ఏరియాల్లో 3 బిల్డింగ్స్‌, కేయు ప్రాంతంలో ఒకటి, పరకాల ఏరియాలో మరో భవనాన్ని లీజు పేరుతో అద్దెకు తీసుకొని హాస్పిటల్స్‌ నిర్మాణ పనులు చేపట్టాడు. ఇందుకోసం 40 మందిని లేబర్‌, సెక్యూరిటీ- గార్డులను నియమించుకొని, పెద్ద హంగామా చేసే ప్రయత్నాలు చేశాడు. వరంగల్‌కు చెందిన కార్డియాలజీ చేస్తున్న విద్యార్థిని తండ్రికి ఆశలు కల్పించాడు. మిషనరీ హాస్పిటల్స్‌ నిర్వహిస్తే పెద్ద ఎత్తున ఫండింగ్‌ వస్తుందని, అలాగే హాస్పిటల్‌ నిర్వహణ బాధ్యత మీరే చూసుకోవాలని సినిమా చూపించి 23లక్షల16వేలు పెట్టు-బడి పెట్టించాడు. హాస్పిటల్‌ మెయింటనెన్స్‌, మెడికల్‌ షాప్‌, ల్యాబొరేటరీ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తానని మరొకరి వద్ద 8 లక్షల 80 వేలు, మరొకరి వద్ద 2 లక్షల 20 వేలు అడ్వాన్స్‌ కింద తీసుకున్నాడు. జనం వద్ద తీసుకొన్న డబ్బులతో 5 భవనాలు అద్దె తీసుకొని, ఆస్పత్రి నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాడు.

అందరికీ ఆగస్టులో హాస్పిటల్స్‌ ప్రారంభిస్తానని, అప్పటి నుండి ఫారిన్‌, మిషనరీ సంస్థల నుండి డబ్బులు రావడంతో పాటు- హాస్పిటల్స్‌ స్టార్ట్‌ అయి లాభాలు వస్తాయని చెప్పాడు. అదీగాక 40 మందిని ఎంప్లాయిస్‌గా నియమించుకొని వారికి సైతం జీతాలివ్వకపోవడం, గడువు దాటిపోవడంతో సదరు మాయగాడిపై అనుమానాలు కలిగాయి. బాధితులు టాస్క్‌ఫోర్స్‌ సిఐ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి కూపీలాగారు. ఇప్పటికే 40 లక్షల వసూళ్ళు చేసినట్టు- గుర్తించారు. జనం సొమ్ముతో నిర్మిస్తున్న హాస్పిటల్స్‌ భవనాలను పరిశీలించారు. చారిటీ- పేరుతో ఆశలు కల్పించి పెట్టు-బడులు పెట్టించిన మహా ముదురు బాగోతాన్ని వెలికితీసే పనిలో పడ్డారు. సంగారెడ్డిలో మాయగాడు చేసిన మోసాలపై 5 కేసులు నమోదై ఉన్నట్లు- గుర్తించారు.

- Advertisement -

జైలుకు పోయి వచ్చి పత్తా లేకుండా మాయం కావడంతో, అక్కడ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఇష్యూ అయింది. వరంగల్‌లో నిరుపేద కుటు-ంబానికి చెందిన మైదం నిరోషాకు 10 లక్షలతో సొంత ఇంటి అవకాశం కల్పిస్తానని చెప్పి, ఆ అమ్మాయి పేరుతోనే అనుమతులకు దరఖాస్తులు చేశాడు. అంతేకాదు బ్యాంక్‌ అకౌంట్‌, చెక్‌ పవర్‌ కూడా ఆమెకే కల్పించి, ఎక్కడా సీన్‌లో తాను లేకుండా జాగ్రత్రాలు తీసుకున్నాడు. సదరు మాయలోడి నుండి ఒక లాప్‌టాప్‌, ఆపిల్‌ ప్యాడ్‌, నకిలీ హాస్పిటల్‌ విజిటింగ్‌ కార్డ్స్‌, 3 మొబైల్‌ ఫోన్స్‌, జీఎస్టీ జిరాక్స్‌ కాపీ, ఉదయం రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ జిరాక్స్‌ కాపీ, 2 రబ్బర్‌ స్టాంప్స్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీజ్‌ చేశారు. తదుపరి చర్యల కోసమై ఇంతేజార్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement