నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేటి మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొంతమంది కడుపునొప్పి, తలనొప్పితో బాధపడ్డారు. 25 మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని మక్తల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
కాగా.. గతంలో నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొందరు కడుపునొప్పి, తలనొప్పితో బాధపడ్డారు. మొత్తం 100 మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కొందరిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లలో తరలించారు.
విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ముగ్గురు విద్యార్థులు మినహా మిగతా వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా, మాగనూరు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ జరిపి వారు తప్పు చేసినట్లు తేలితే సస్పెండ్ చేయాలని నారాయణపేట కలెక్టర్‌ను ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, విచారణ జరిపి.. తనకు నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.