Wednesday, November 20, 2024

Madhira – అధికారులూ…. ఇక ప‌రుగులు పెట్టాల్సిందే … ఉఫ ముఖ్య‌మంత్రి భ‌ట్టి

ఎన్నికల కోడ్ ముగిసింది అధికారులు అభివృద్ధి పనుల వేగవంతం పెంచాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇది ప్రజా ప్రభుత్వమ‌ని, ప్రజలకు హామీలు ఇచ్చామన్నారు. అధికారుల జవాబుదారీ తనంతో పనిచేయాలని తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో మధిర అభివృద్ధిపై నేడు అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మధిరలో అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం 128 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, అధికారులు అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌కుండా , ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌లోకి తీసుకెళ్లాల‌న్నారు.. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు , అధికారులు వివిధ రాజకీయ పార్టీ నేతలు హ‌జ‌ర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement