Thursday, November 28, 2024

ADB | రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన గొండు చిత్రకారులు ఆనంద్ రావు

జైనూర్, అక్టోబర్ 30 (ఆంధ్రప్రభ) కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని రాసిమెట్ట గ్రామానికి చెందిన ఆదివాసి గొండు చిత్ర కళాకారుడు మడావి ఆనందరావు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా మంగళవారం రాత్రి ఢిల్లీలో అవార్డు అందుకున్నారు. భారత రాజధానిలో రాష్ట్రపతి భవన్ లో 13రోజుల పాటు జరిగిన గోండు పెయింటింగ్ వర్క్ షాప్ లో మడావి పాల్గొని తనదైన శైలిలో ఆదివాసుల ఆరాధ్య దైవం ఆత్మసూర్ పేన్ సంస్కృతి సంప్రదాయాలతో కూడుకున్నటువంటి గుసాడితాదొ డప్పు తుడుం కొడుతున్న గోండు చిత్రాలు వేసి దీపావళి పండుగ ఇతిహాసాన్ని వివరించి ప్రదర్శన చేశారు.

ఆయన వేసిన ఆల్బమ్ ని చూసి భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అభినందించారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ఆదివాసి గోండు చిత్ర కళాకారుడికి మడావి రాజేశ్వర్ అంతర్జాతీయ గోండు చిత్రకళాకారుడు. గోండు ఆర్ట్ డైరెక్టర్, డిజైనర్. ట్రైనింగ్ మాస్టర్ ఆదివాసీ పెద్దలు అభిమన్యు గ్రూప్ సభ్యులు, ఆదివాసి సంఘాల నాయకులు కూడా ఆనంద్ రావు అభినందించారు.

ఆదివాసికి చెందిన ఆనందరావు చిత్రకళా రూపంలో రాణించడం ఎంతో సంతోషకరమన్నారు. మడావి ఆనందరావు చిన్న వయసులోనే చిత్రకళలో ఎదుగుతూ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎంతో గర్వకారణమ‌ని ఆదివాసిం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement