ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా కదిలి రాగల 36గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని పేర్కొన్నది. దాంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాసబ్‌ట్యాంక్, లక్డీకపూల్, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్టలో వాన పడుతోంది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉన్నది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. ఈ నెల 17వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement