భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇల్లెందు మండలం నెహ్రూనగర్‌లో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అమ్మాయి ప్రాణాలు కోల్పోగా, అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతడిని మెరుగైన చికిత్స ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి పేరు బోడ శ్వేత(20)గా గుర్తించారు. ఆమె స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కొన్నేళ్లుగా గుగులోత్ వెంకటేశ్ అనే యువకుడిని ప్రేమిస్తోందని తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement