Friday, November 22, 2024

TS: ప్రేమ విఫలమైందని.. యువకుడి సెల్ఫీ సూసైడ్

తిమ్మాపూర్, జనవరి 3 (ప్రభ న్యూస్) : ప్రేమ విఫలమైందని యువకుడు సెల్ఫీ తీసుకుంటూ సూసైడ్ చేసుకున్న విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన కోమటి శివ (21) అనే యువకుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ విఫలమైందని క్రిమిసంహారక మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎల్ఎండి ఎస్ఐ చేరాలు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement