ఔటర్ రోడ్డుపై నుండి లారీ బోల్తా పడడంతో డ్రైవర్ కు తీవ్రగాయాలైన ఘటన హైదరాబాద్ హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర చోటుచేసుకుంది. డస్ట్ లోడ్‌తో వెళ్తున్న వాహనం.. అదుపుతప్పి ఔటర్ పై నుండి బోల్తా కొట్టింది. డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి.. డ్రైవర్‌ను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు.