Thursday, January 9, 2025

KNR | చెట్టును ఢీకొన్న లారీ – క్లీన‌ర్ దుర్మ‌ర‌ణం..

అదుపుతప్పి లారీ చెట్టును ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కరీంనగర్-హుజురాబాద్ మండలం మాందాడి పల్లిలో వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని క్లీనర్ మృతి చెందాడు.

యాక్సిడెంట్ జరిగిన సమయంలో స్థానికులు, ఫైర్ సిబ్బంది శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీసుకొచ్చారు.డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

డివైడ‌ర్ లో ఆటో ట్రాలీ ఢీ – 13 మందికి గాయాలు ..

- Advertisement -

వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది కూలీలకు గాయాలయ్యాయి. కరీంనగర్ – హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామ స్టేజి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన కూలీలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం వారంతా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కందుగుల గ్రామం నుంచి భీంపల్లి గ్రామానికి వరి నాటు వేయడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలియడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎవరికి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement