హైదరాబాద్ మహానగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున వాణి కెమికల్ కంపెనీ ముందు ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో హార్డ్‌వేర్ సామాగ్రిని తరలిస్తున్నట్లు సమాచారం. రన్నింగ్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై ఒక్కసారిగా దానిని రోడ్డు పక్కన నిలిపివేసినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ప్లాస్టిక్ తయారీ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. నిప్పు రవ్వలు ఎగసి పడినట్లు అయితే మరో ఘోర ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
- Advertisement -