నిజామాబాద్ ప్రతినిధి, జనవరి4 (ఆంధ్రప్రభ) : ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రవేట్ ఆసుపత్రుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సమితి సభ్యులు డిమాండ్ చేశారు. నగరంలోని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్, మెడికల్ ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సమితి ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈసందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ… నిజామాబాద్ నగరంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లలో మెడికల్ ల్యాబ్, స్కానింగ్ మాఫియా నడుస్తుందని మండిపడ్డారు. కొంతమంది పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పల్లెల నుండి నగరానికి వైద్యం కోసం వస్తే కొంతమంది మాఫియా ధనార్జనే ధ్యేయంగా అవసరం లేని టెస్టులు రాస్తూ డబ్బులు దండుకుంటు న్నారని ఆరోపించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మెడికల్, ల్యాబ్, స్కానింగ్ మాఫియాపై సంబంధిత ప్రభుత్వ శాఖ అధి కారులు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీకాంత్, హన్మాండ్లు (బుజ్జి), రాజ్ గణేష్, అజిగిరి రాకేష్, నల్ల నవీన్, సాయికుమార్, చంటి, సతీష్, నవీన్, మధు, ప్రశాంత్, సుజిత్, కళ్యాణ్, కృష్ణ, ప్రసాద్, అక్షయ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.