Friday, November 22, 2024

అష్ట జలదిగ్బంధంలో ఆళ్లపల్లి మండలం

ఆళ్ళపల్లి జులై 27 (ప్రభన్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్ళపల్లి మండలం ఆనంతోగు వద్ద బ్రిడ్జిపై వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. రాయపాడు గ్రామం వద్ద, లో లెవెల్ వంతెన బుధవారం సాయంత్రానికి పూర్తిగా మునిగిపోయింది, గురువారం ఉదయం వరకు 150-200 అడుగులపైకి నీటిమట్టం సాగుతుంది. నీటి ఉధృతితో కిన్నెరసాని, జల్లేరు, కోడెలవాగులు పొంగిపొర్లుతుంది. ఇదిలా ఉండగా మండలంలో రాయిగూడెం గ్రామంలో పదుల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. పలు గ్రామాలలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిల పిల్లర్లు సైతం శిధిలావస్థకు చేరుకున్నాయి. పలు గ్రామాలలో ఇండ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజల కష్టాలు వర్ణనానితం. ప్రధాన రహదారులు, బిటి రోడ్లు నీటి కోతకు గురై భారీ లోతుగా గుంతలుగా మారాయి. ప్రయాణికులు, గర్భిణీ మహిళలు, అనారోగ్యం పాలైన ప్రజలకు అంతరాయం ఏర్పడి రాకపోకలకు జలదిగ్బంధంతో ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. చెరువులు, కుంటలు, పంట పొలాల్లో జలాశ‌యాలుగా మారాయి. దాంతో మండల వ్యాప్తంగా అష్టదిగ్బంధంగా మారడంతో ప్రజలకు నిత్యవసర సరుకులకు రాకపోకలకు నిత్యం రైతులు బిటి రోడ్డుపై నడిచేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక తహసిల్దార్ సాదియా సుల్తానా, ఎస్ఐ రతీష్, మండల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహాయ, సహకారాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇంతటి భారీ వర్షం గత 1986లో రావడం జరిగిందని, దానికి మించి 2023లో అధిక వర్షం నమోదు కావడం 37 సంవత్సరాల్లో కిన్నెరసాని ప్రవాహం ఇదే ప్రథమం కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement