Tuesday, November 26, 2024

TS: ఇవాళ్టి నుంచి లోక్ సభ ఎన్నికల నామినేషన్ల పర్వం

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్‌ వెలువడడంతోపాటు నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. మెజారిటీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి.  కాంగ్రెస్‌, బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి.

- Advertisement -

పలువురు అభ్యర్థులు తొలిరోజైన గురువారం నుంచే నామినేషన్లు దాఖలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. నెల రోజుల కిందటే ఎన్నికల షెడ్యూలు వెలువడడంతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది.

లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ..  లోక్‌సభ పోరులోనూ 15 సీట్లు సాధించాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ తన సత్తాను నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకున్న బీజేపీ.. లోక్‌సభ పోరులో గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించాలని ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలు అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్‌ 14 సీట్లకు పేర్లు ఖరారు చేసింది. కరీంనగర్‌, ఖమ్మం, హైదరాబాద్‌లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement