న్యూఢిల్లీ: ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్లే అవిశ్వాసం పెట్టారని ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పాటులో భాజపాది కీలక పాత్ర. చీమలు పెట్టిన పుట్టలో పాములు చొర్రినట్లు.. మా తెలంగాణలో ఓ కుటుంబం చేరింది. అది భారత్ రాష్ట్ర సమితి కాదు.. బ్రష్టాచార్ రాష్ట్ర సమితి. 24గంటల కరెంట్ ఇస్తున్నారని చెబుతున్నా.. అది నిజమని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా. రైతులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ ఎక్కడికీ వెళ్లలేదు. కాంగ్రెస్, భారాస కుమ్మక్కయ్యాయి’’ అని బండి సంజయ్ విమర్శించారు.
తెలంగాణలో ఈ తొమ్మిదేళ్లలో కెసిఆర్ కుటుంబ ఆస్తులు మాత్రమే పెరిగాయంటూ మండిపడ్డారు.. గరిబ్ యోజన్ కోసం ఇచ్చిన బియ్యాన్ని సైతం అమ్ముకున్న చరిత్ర బిఆర్ఎస్ ది అంటూ ఆరోపించారు.. కాంగ్రెస్, ఎంఐఎం,బిఆర్ఎస్ పార్టీలు ఒక గొడుగుకింద చేరి నాటకాలు ఆడుతున్నాయన్నారు.. అసలు కాంగ్రెస్ కు తెలంగాణాలో ఉనికే లేదన్నారు.. ఇటీవల జరిగిన ఏ ఎన్నికలలోనూ ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు రాలేదని అన్నారు.. ఇదే సమయంలో దుబ్బాక, హుజుర్ నగర్ ఉప ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో సైతం కమలం వికసించిదన్నారు బండి సంజయ్