Thursday, November 21, 2024

Lok Manthan – అమ్మ‌ను మ‌రొవ‌ద్దు… అమ్మ భాష‌ను మ‌రొవ‌ద్దు – మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

లోక్‌ మంథన్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన వెంక‌య్య నాయుడు
శిల్పారావంలో నాలుగు రోజుల పాటు కార్య‌క్ర‌మాలు
కుటుంబ వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌తో సంస్కృతి వికాసం
భార‌తీయ మూల‌లు తెలుసుకునే మ‌హోత్త‌ర కార్య‌క్ర‌మం

హైద‌రాబాద్ – అమ్మ భాషకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పిల్లలను సున్నితంగా పెంచకుండా చిన్న తనం నుంచే కష్టం అంటే ఏంటో తెలిసేలా పెంచాలని కోరారు. హైదరాబాద్‌లోని శిల్ప‌రావంలో ఏర్పాటు చేసిన లోక్‌ మంథన్ కార్యక్రమాన్ని ఆయ‌న జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవాలని సూచించారు. పెద్దలను గౌరవించేలా పిల్లలను తయారు చేయాలని అన్నారు.

లోక్ మంథన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను ప్రారంభించటం త‌న‌కు ఆనందదాయకంగా ఉంద‌ని వెంక‌య్య అన్నారు.. చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయ‌న అభినందించారు. నేటికీ ప్రకృతితో కలిసి జీవిస్తూ, సామాజిక ప్రధాన జీవన స్రవంతిలో మరుగు పడిన వర్గాలను, మనం నాగరికం అనుకుంటున్న సమాజానికి తిరిగి చేరువ చేసి, నేటి యువతకు నిజమైన ధర్మాన్ని తెలియజేయటమే లక్ష్యంగా సాగుతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆయ‌న ఆకాంక్షించారు.

రాయి, రప్ప, చెట్టు, పుట్ట, గాలి, నీరు… ఇలా అన్నింటిలోనూ భగవంతుణ్ని చూడగలిగి వ్య‌వ‌స్థ‌మ‌న‌ది అని అన్నారు. సమస్త మానవాళి అభివృద్ధిని ఆకాంక్షించే వసుధైవ కుటుంబ భావన భారతీయుల సొంతమ‌న అన్నారు. మన సంస్కృతి మీద జరిగిన దాడుల‌తో, , మనదైన సంస్కృతిని దూరం చేసి, అనేక ప్రతికూల భావనలను మన మనసుల్లో నాటాయ‌ని వివ‌రించారు మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి.. ఈ జాఢ్యాలను వదిలించుకుని, మూలాలను తిరిగి తెలుసుకుని, భారతీయ విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్ తరాలకు మన ధర్మాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను, భాషను మరింత చేరువ చేయాలని కోరారు. భారత సంస్కృతిని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని చెప్పారు. ప్రకృతిని ఎదుర్కోవడం అందరి బాధ్యత అని గుర్తుచేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

కాగా, ఈ కార్యక్రమం శిల్పారామంలో గురువారం నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగనుంది. 2016లో మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో లోకమంథన్‌ను వైభవంగా నిర్వహించారు. ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో నిర్వహిస్తూ వస్తోంది. ఆ రకంగా ఇది నాలుగో లోక్‌మంథన్‌. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ అతిధ్య‌మిస్తున్న‌ది.. రేపు జ‌రిగే కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement