Wednesday, November 20, 2024

ఏపీ లాయర్లకు తెలంగాణ లాక్ డౌన్ నుంచి మినహాయింపు!

ఏపీ న్యాయవాదులు తెలంగాణలో వచ్చేందుకు పోలీసు అధికారుల నుంచి పాసులు పొందవచ్చని తెలంగాణ హైకోర్టు తెలిపింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ న్యాయవాదులను తెలంగాణ సరిహద్దులో నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఇంకా మూడేళ్లు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో కార్యాలయాలు ఉన్నాయని, రాకపోకలు నిలిపివేయడంతో ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ ఏజీని హైకోర్టు వివరణ అడిగింది.

తెలంగాణ బోర్డర్‌లో ఏపీ న్యాయవాదులను ఎందుకు నిలిపివేస్తున్నారో బుధవారం ధర్మాసనం ముందు ఉంచుతామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వ ఏజీ తెలిపారు. దీంతో మధ్యాహ్నo 2 గంటల నుంచి 5 గంటల వరకు.. న్యాయవాదులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అవసరమైన న్యాయవాదులు సంబంధిత పోలీసు అధికారుల నుంచి పాసులు పొందవచ్చని పేర్కొంది. హైకోర్టు, ఇతర దిగువ కోర్టులు, కార్యాలయ విధులకు హాజరయ్యే న్యాయవాదులకు వర్తింపజేయాలంటూ పోలీసు శాఖకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement