Tuesday, November 19, 2024

దేవరకొండలో లాకప్ డెత్!

!నల్లగొండ – దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలో పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి మరణించాడు. చింతపల్లి ఎస్సై సతీష్ రెడ్డి కొట్టడం వల్లే మృతి చెందాడు అంటూ ఆరోపిస్తూ బంధువులు ఆందోళన కు దిగారు.

బంధువుల కథనం ప్రకారం పాలెం తండాకు చెందిన ఇద్దరు అన్నదమ్ముల భూముల పంచాయతీలో కాంగ్రెస్ ఎంపీటీసీ వసంత్ నాయక్.జోక్యం చేసుకున్నాడు. విచారణ కొసం సూర్య నాయక్ ను చింతపల్లి ఎస్సై సతీష్ రెడ్డి స్టేషన్ కు పిలిచారు. కాంగ్రెస్ ఎంపీటీసీ వసంత్ నాయక్ సమక్షంలో. ఎస్సై సతీష్ రెడ్డి అతడిని విచారించారు.

ఈ సమయం లోనే ఎస్సై పోలీస్ స్టేషన్లో చావబాదడంతో సూర్య నాయక్ అక్కడిక్కడే మృతి చెందాడనీ, వసంత్ నాయక్ ఈ దాడి చేయించారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.

సూర్య మృతితో నాకు సంబంధం లేదు: ఎస్ఐ సతీష్ రెడ్డి

- Advertisement -

చింతపల్లి మండలంలోని పోలేపల్లి రాంనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని పాలెం తండకు చెందిన సూర్య మృతితో నాకు సంబంధం లేదని చింతపల్లి ఎస్సై సతీష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గల కారణంగా విచారణ కోసం మాత్రమే పోలీస్ స్టేషన్‌కు పిలిపించామన్నారు. అనుకోకుండా సాయంత్రం సమయంలో స్పృహ తప్పి పడిపోవడం వల్ల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించామన్నారు. అయితే హాస్పిటల్ లో వైద్యులు బీపీ పరిశీలిస్తుండగానే సూర్య నాయక్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతోనే అతను చనిపోయాడని ఎస్‌ఐ తెలిపారు. అంతేగాని తాను కొట్టడం వల్ల సూర్య నాయక్ చనిపోయాడని చేస్తున్న ఆరోపణలు ఎలాంటి నిజం లేదని ఆయన ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement