హైదరాబాద్, : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 తేదీ వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ అమలు, ఇంటింటా జరుగుతున్న జ్వర సర్వే, కొవిడ్ పరిస్థితులపై మంత్రులందరితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌తోపాటు, జ్వరసర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయని, రోజువారీగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని మంత్రులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కొనసాగిస్తే కరోనాను పూర్తిగా నియంత్రించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ మేరకు ఇప్పటికే కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. కాగా, కరోనా నియంత్రణ కార్యక్రమాలు, వైద్యసేవల పర్యవేక్షణలో జిల్లాల్లో మంత్రులు బిజీగా ఉన్నందున ఈ నెల 20న నిర్వహించాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేశారు.