హైదరాబాద్, లాక్‌డౌన్ మొదలై.. తెలంగాణలో ఇప్పటికే నాలుగురోజులు పూర్తయింది. ప్రతిరోజూ 20గంటల లాక్‌డౌన్‌ను గత నాలుగురోజులుగా అమలుచేస్తుండగా, దీని ప్రభావం ఆశాజనకంగా ఉందని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. లాక్‌డౌన్ ముందు పాజి టివ్ రేటు 10.5శాతం వరకు ఉండగా, ఇపుడు టెస్ట్‌లతో పోలిస్తే కేసుల సంఖ్య 6.67శాతంగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులతో పోలిస్తే రికవరీ రేటు ఎక్కువగా ఉందని, శనివారం 4298 కొత్త కేసులు నమోదైతే రికవరీ అయిన కేసుల సంఖ్య 6,026గా ఉందని చెబుతున్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ మంత్రివర్గం ఈనెల 12నుండి లాక్‌డౌన్ విధించడంతో పాటు పరిశ్రమలు, మునిసి పల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు నేతృత్వంలో మందుల కొరత తీర్చేం దుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా నియ మించింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా.. వైద్యులపై ఒత్తిడి పెరగడం తగ్గిందని, ఇదే కట్టడి కొనసాగితే మరో పదిరోజుల తర్వాత గణనీయ మార్పును చూడవచ్చని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
కొరత లేకుండా..
లాక్‌డౌన్‌కు ముందు.. రాష్ట్రంలో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, ఔషదాల కొరత తీవ్రంగా ఉండేది. అంబులెన్స్‌లోనే ప్రాణా లు పోతున్నా నిస్సహాయస్థితిలో.. చూడడం తప్ప ఏం చేయలేని ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. డాక్టర్లు, వైద్య సిబ్బంది తీవ్రమైన ఒత్తిడిలో.. ఊపిరాడని పరిస్థితుల్లోనూ నిర్విరామంగా సేవలందించారు. అయినా మౌలిక వసతుల కొరతలతో.. కళ్లముందు ప్రాణాలు పోతుంటే మనసు చివుక్కుమనేది. ఆస్పత్రిలో చేరిన రోగులకు.. లాక్‌డౌన్ తర్వా త ప్రాణాపాయం తగ్గిందని, వైద్యసేవలు అందించే అవకాశం దొరుకుతోందని చెబు తున్నారు. ఇక పేషంట్లకు కూడా ఎక్కడికి రోగులను తరలించాలి.. ఎక్కడ చికిత్స అందుతుందన్న స్పష్టత లభించిందని దీనివల్ల నాలుగైదు రోజుల క్రితంతో పోలిస్తే ఇపుడు డేంజర్ కాస్త తగ్గినట్లు కనబడుతోం దని, అయినా అందరూ జాగ్రత్తగా ఉండా ల్సిందేనని డాక్టర్లు చెబుతున్నారు. ఇక ఆక్సిజన్ కొరత నివారించడం, రెమిడెసివర్ వంటి మందులు.. మునుపటితో పోలిస్తే కొంత అందుబాటులోకి రావడం ఊరటనిచ్చే అంశమని చెబుతున్నారు. కొవిడ్ బాధితు లు.. ఎంపికచేసుకున్న ప్రఖ్యాత ఆస్పత్రులకే వెళుతూ బెడ్ల కొరత ఉందని ఆందోళన చెందుతున్నారని.. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లోనూ అనేక ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయని.. బెడ్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెంచడం, ఇందుకు తగ్గట్లు మౌలిక వసతులు కల్పించడం వల్ల రిస్క్ తగ్గిందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల పేషంట్ల వల్ల తెలంగాణ రోగులకు కొంత ఇబ్బంది జరుగు తోందని, అయినా అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరిస్తున్నారు. ఈ నెలాఖరువరకు కట్టడి చర్యలు కొనసాగితే.. కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నామని, ఇప్పటికే లాక్‌డౌన్ పక్షం రోజులకు పైగా అమలుచేసిన ఢిల్లిd, మహా రాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసుల తగ్గుదల చూస్తు న్నామని ఆరోగ్యశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. తెలంగాణలో ఆ దిశగా అడుగులు పడుతున్నా, మరో పదిరోజుల లాక్‌డౌన్ తర్వాత స్పష్టమైన మార్పును చూడవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆక్సిజన్, మందుల కొరత రాష్ట్రంలో ఇంకా ఇబ్బందికరంగా ఉండగా, కఠిన లాక్‌డౌన్ బెడ్లసంఖ్యకు అనుగుణంగా.. మందులు అందుబాటులో ఉంచితే పరిస్థితి మెరుగు పడుతుందన్న వాదనలు వినబడుతున్నాయి.
కట్టడి ఫలం – తగ్గుతున్న పాజిటివిటి రేటు..
Advertisement
తాజా వార్తలు
Advertisement