Sunday, September 15, 2024

Local Body Elections … ఓట‌ర్ల జాబితా షెడ్యూల్ రిలీజ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 6న ఆయా గ్రామపంచాయతీలలో వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఈ జాబితాపై సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 13 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 9, 10 తేదీలలో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది జాబితాను ప్రచురిస్తారు. ఈ నెల 29న ఓటరు జాబితా తయారీపై జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement