Wednesday, November 20, 2024

Local Body Elections – పంచాయ‌తీ మ‌రింత ఆల‌స్యం!… వచ్చే ఏడాది జనవరిలో జరిగే అవకాశం..


ఫైనల్ కాని బీసీ కులగణన, రిజర్వేషన్లు
ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు 23 శాతం
42 శాతానికి పెంచుతామన్న‌ కాంగ్రెస్
ఇందుకోస‌మే ఎన్నిక‌లు లేట్‌
వెంట‌వెంట‌నే పంచాయ‌తీ, మున్సిపాలిటీ ఎల‌క్ష‌న్స్

తెలంగాణలో వ‌రుస ఎన్నిక‌లు హోరెత్తిస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ప్ర‌శాంతంగా జ‌రిగాయి. సోమ‌వారం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. వీటి తర్వాత అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. అయితే.. ఈ ఎన్నిక‌లు జూలైలో నిర్వహించాలని ప్ర‌భుత్వం భావించింది. కానీ.. ఈ ఎన్నికలు వచ్చే ఏడాది జనవరిలో జరిగేలా ఉన్నాయ‌ని ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దీనికి బలమైన కారణం బీసీల రిజర్వేషన్లు. బీసీ రిజర్వేషన్ ఖరారు కాకుండా, ఎన్నికలు వెళ్లొద్దని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఫైనల్ కాని బీసీ రిజ‌ర్వేష‌న్లు
బీసీ కులగణన, రిజర్వేషన్లను ఫైనల్ చేయడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుంది. దీంతో.. జనవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికలు ఆ వెంటనే మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈలోపు బీసీ జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులగణన చేపట్టి, స్థానిక సంస్థల్లో వారి రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

- Advertisement -

నాలుగైదు నెల‌ల స‌మ‌యం..
ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు 23 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో చట్ట సవరణ చేయాలంటే కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనున్నది. ఇక జూలైలో మండల పరిషత్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం కూడా ముగిస్తే.. వాటికి కూడా స్పెషల్ ఆఫీసర్లను నియమించే అవకాశం ఉంది. మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి ముగుస్తుంది. అక్కడ కూడా ప్రత్యేక అధికారులను నియమిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement