Thursday, January 23, 2025

KHM | అర్హులైన రైతుల‌కు రూ.2లక్షల రుణమాఫీ జరగాలి.. ఎమ్మెల్యే ఆదినారాయణ

ములకలపల్లి, జనవరి 23 (ఆంధ్రప్రభ) : అర్హులైన ప్ర‌తి రైతుకు రూ.2ల‌క్షల రుణమాఫీ జరగాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. ములకలపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, జిల్లా సహకార బ్యాంకులను ఎమ్మెల్యే సందర్శించి మేనేజర్ల ద్వారా మండలంలో ఇప్పటి వరకు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ వివరాలను ఇంకా అర్హత ఉండి రుణమాఫీ కానీ రైతుల వివరాలు పరిశీలించారు.

సాంకేతిక సమస్యల వల్ల ఇంకా మాఫీ కానీ రైతులకు ప్రత్యేక చొరవ తీసుకొని మాఫీ జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో ఇటీవల ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement