Friday, November 22, 2024

LIVE – తెలంగాణ అమరవీరుల అఖండ జ్యోతిని ప్రారంభించనున్న కెసిఆర్

CM Sri. KCR Participating in Inauguration of Telangana Martyrs Memorial at Tank Bund

https://youtu.be/Nl_f1pAzhlQ

హైద‌రాబాద్ – ఓ వైపు హుస్సేన్‌ సాగర్‌, మరో వైపు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సెక్రటేరియట్‌ మధ్య తెలంగాణ అమరవీరుల అఖండ జ్యోతి రూ.177.50 కోట్లు- వెచ్చించి నిర్మించారు.. ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారు చేయడం దీని ప్రత్యేకత. ఈ అమ‌ర‌జ్యోతి ప్రారంభ సంద‌ర్భంగా అంబేద్కర్‌ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు ఆరు వేల మంది కళాకారులు ప్రదర్శన ఇచ్చారు..అనంత‌రం నిర్వ‌హించిన‌ తుపాకులతో అమరవీరులకు నివాళి అర్పించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ కూడా పాల్గొ న్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం అమరజ్యోతిని లాంచ‌నంగా ప్రారంభించారు… ఈ కార్య‌క్ర‌మాన్ని లైవ్ షోగా తిల‌కించ‌గ‌ల‌రు..

800 డ్రోన్లతో ప్రదర్శన, లేజర్‌ షో
ఇక 800 డ్రోన్లతో ప్రదర్శనతో పాటు- అమరవీరుల కోసం జోహార్‌ అనే అక్షరాలతో స్మారక చిహ్నంపై లేజర్‌ షో ఉంటు-ంది. ఇక ఈ అమరవీరుల అఖండ జ్యోతికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మొదటి అంతస్తులో మ్యూజియం, ఫోటో గ్యాలరీ ఉంది. రెండో అంతస్తులో 500 మంది కెపాసిటీ- ఉన్న కన్వెన్షన్‌ హాల్‌, లాబీ ఏరియా ఉన్నాయి. మూడో అంతస్తు, -టె-ర్రర్‌ అంతస్తులో రెస్టారెంట్‌, ఓపెన్‌ -టె-ర్రస్‌ సిట్టింగ్‌ ఏరియాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement