57 మందికి బంగారు పతకాలు
592 మందికి పట్టాల ప్రదానోత్సవం
పట్టాలు అందించిన రాష్ట్రపతి ముర్ము
కార్యక్రమలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
హాజరైన గవర్నర్ జిష్టుదేవ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరాధే,
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహ,
రాష్ట్రపతి టూర్‌లో మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సీతక్కకు చాన్స్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలో జస్టిస్ సిటీలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి పర్యటనలో మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సీతక్క ఉన్నారు. కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, నల్సార్ వైఎస్ చాన్స్‌లర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.వాసంతి, నల్సార్ యూనివర్సిటీ ఉపకులపతి క్రిష్ణదేవరావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తీర్ణులకు పతకాలు..
ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దాదాపు 57 బంగారు పతకాలను రాష్ట్రపతి ముర్ము అందించారు. పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ, పీజీ డిప్లోమా ఇన్ క్రిమినల్ జస్టిస్ మేనేజ్‌మెంట్ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉత్తీర్ణులైన 592 మంది పట్టభద్రులకు రాష్ట్రపతి పట్టాలు ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి బొల్లారం వెళ్లనున్నట్టు సమాచారం.