హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి ‘బ్రాహ్మణ సదన్’ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్ నగర శివారులోని గోపనపల్లిలో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా చండీయాగం, సుదర్శన యాగం నిర్వహించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిధుల వ్యయం, నిర్మాణం, పర్యవేక్షణ జరిగింది. ఈ సందర్భంగా కెసిఆర్ సందేశమిస్తూ, దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని, సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా రూపుదిద్దుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అర్చక పౌరహిత్యమే జీవనాధారంగా చేసుకుని, నిత్యం భగవత్ సేవలో నిమగ్నమౌతూ, సమస్త లోక క్షేమాన్ని కాంక్షిస్తూ తమ జీవితాలను ధారపోసే బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజం మీద ఉన్నదని అన్నారు. స్వరాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా ఎంచుకుని పలు పథకాలు అమలు చేయడం వెనుక ఇదే తాత్వికత ఇమిడి ఉన్నదని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement