Monday, November 25, 2024

LIVE from Secretariat – మందిర్,మసీద్,చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమం … హాజరైన గవర్నర్ , సిఎం కెసిఆర్

Governor Smt. Tamilisai Soundararajan & CM Sri. KCR Participating in Inauguration of Church & Mosque

https://youtu.be/tFZ8GlqrP0o

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సచివాలయం ప్రాంగణంలో నిర్మితమైన దేవాలయం, మసీద్‌, చర్చి మ‌రికొద్దిసేప‌టిలో సీఎం కేసీఆర్‌ మీదుగా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళి సై హాజరయ్యారు. తెలంగాణ పరిపాలనా సౌధం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం సర్వమత సమ్మేళనానికి అత్తం పట్టనున్నది. సచివాల యం ఆవరణలో కొత్తగా ఈ మూడు నిర్మాణాలు పూర్తయ్యాయి. సచివాలయం ఆవరణలో నిర్మించిన ఆలయంలో శివుడు, గణపతి, పోచమ్మ, హనుమంతుడి ఆలయాలున్నాయి. ఆయా దేవుళ్ల విగ్రహాలను తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర శిల్ప కళాశాల నుంచి ప్రత్యేకంగా ఆయరు చేయించి తెప్పించారు. కాగా, గుడి, మసీదు, చర్చిలను సచివాలయంతోపాటే ప్రారంభించాలని భావించినా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో సాధ్యంకాలేదు. ఆగష్టు 25నాటికి ప్రారంభించాలని భావించినా అనివార్యంగా కొన్ని పనులు పెండింగ్‌లో పడటంతో నిల్చిపోయింది. హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి దేవాలన్ని నేడు పున:ప్రారం భించనున్నారు. ఆ తర్వాత ఇస్లాం, క్రిస్టియన్‌ మతాల సాంప్రదా యాల మేరకు ఆయా మత పెద్దల సమక్షంలో మసీదు, చర్చిలను ప్రారంభిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement