CM Sri. KCR Participating in Inauguration of Integrated District Offices Complex at Medak District
ఉమ్మడి మెదక్ బ్యూరో (ప్రభ న్యూస్): మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన సీఎం.. ఆ తర్వాత జిల్లా ఎస్పీ ఆఫీసును ప్రారంభించి ఎస్పీ రోహిణి ప్రియదర్శినిని ఆశీర్వదించారు. ఆ తర్వాత పోలీసుల గౌరవం స్వీకరించారు. అక్కడి నుంచి కలెక్టరేట్ సమీకృత ఆఫీసుల సముదాయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులున్నారు.
కాగా, పూజారులు ఆయనను స్వాగతించి ఆశీర్వచనాలు అందించారు. ఎస్పీ ఆఫీసు ప్రారంభోత్సవం అనంతరం ఎస్పీ రోహిణీ ప్రియదర్శినిని కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవం వందనం స్వీకరించారు..
కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టర్ రాజర్షిషాకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీటులో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆచారం ప్రకారం.. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.