Friday, November 22, 2024

Liquor Scam – క‌విత‌కు నిరాశ ….రెండు పిటిష‌న్ లు కోర్టు తిర‌స్క‌ర‌ణ ..

న్యూఢిల్లీ – సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు నేడు తిరస్కరించింది. ఆమె దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ తోసిపుచ్చింది. ఇక కస్టడీ తీర్పును రిజర్వ్ చేసింది. అంత‌కు ముందు లిక్కర్ స్కామ్ కేసులో కవితను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. అయితే కవితను ఐదు రోజుల కస్టడీకి సీబీఐ కోరింది.
ఈ సందర్భంగా కోర్టులో కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని తెలిపింది. విజయ్ నాయర్ తో పాటు పలువురితో కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ వేశారని ఆరోపించింది. ఢిల్లీ, హైదరాబాద్‌లో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం.. ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమమవుతోందని కోర్టుకు తెలిపింది.


రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు కవిత అందించారని తెలిపింది. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ.25 కోట్లు అందజేశారని పేర్కొంది. వాట్సాప్ చాట్‌లు ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్ ను కోర్టుకు అందజేశామని తెలిపింది. బుచ్చిబాబు స్టేట్ మెంట్ ప్రకారం కవితకు.. ఇండో స్పిరిట్ సంస్థలో 33 శాతం వాటా ఉందని తెలిపింది. కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం.. అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్టు తెలిపారు. ఈ విషయాలను చార్జిషీట్లలో పొందుపరిచామని సీబీఐ న్యాయవాది తెలిపారు.


ఇది ఇలా ఉంటే విచారణకు ముందు కోర్టు హాలులో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ అక్రమం, అన్యాయం అని అన్నారు. త‌న‌ను అరెస్ట్ చేయబోయే విషయం రాత్రి 10:30 గంటలకు చెప్పారని అసహనం వ్యక్తం చేశారు. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు. మాకెలాంటి సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అరెస్ట్ చేసిందన్నారు. తన హక్కులను కాపాడాలని, అరెస్ట్ అక్రమం అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు

Advertisement

తాజా వార్తలు

Advertisement