Friday, November 22, 2024

Liquor Scam – కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత
డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత
విచారణను వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు

అంధ్రప్రభ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – బి ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. రౌస్ అవెన్యూ కోర్టు ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్ట్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన కవిత తీహార్ జైల్లో ఉన్నారు. సీబీఐ కేసులో ఆమె డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జి‌షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. అనారోగ్య కారణాలతో ఉన్న కవితకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం మెడికల్ రిపోర్టులను జైలు అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు.

కవితపై చార్జీ షీట్ .. ఆమోదించిన కోర్టు

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జులై 26న కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచాలని సీబీఐకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఛార్జిషీట్ కాపీలను నిందితుల తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. సీబీఐ దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానం విచారణ జరిపింది. కవిత మరో నలుగురిపై జూన్ 7న సీబీఐ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement