Friday, November 22, 2024

Liquor Scam – కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా

లిక్క‌ర్ కేసులో కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ విచార‌ణ‌ను రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై శుక్రవారం విచారణ జరపనుంది. దీనిపై గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని జడ్జి కావేరి బవెజా ఆదేశించారు. అలాగే. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై వేసిన ఛార్జ్ షీట్ ను కవిత తరపు న్యాయవాది తప్పుపట్టారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న జడ్జి కావేరి బవెజా శుక్రవారాని పిటిషన్ ను వాయిదా వేశారు.

డిఫాల్ట్ బెయిల్ అంటే..

నిర్ణీత వ్యవధిలోగా పోలీసులు, దర్యాఫ్తు సంస్థలు కేసు విచారణ పూర్తిచేయడంలో విఫలమైతే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తికి బెయిల్ పొందే హక్కును క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్ పీసీ) కల్పిస్తోంది. సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) ప్రకారం.. నిర్దిష్ట గడువులోగా విచారణ పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేయడంలో పోలీసులు విఫలమైతే.. బెయిల్ పొందే హక్కు నిందితుడికి ఉంటుంది. అయితే, ఇది కేసు తీవ్రతను బట్టి దర్యాఫ్తు గడువు వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లో విచారణ పూర్తిచేయడం సాధ్యం కాదని పోలీసులు భావిస్తే నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టి కస్టడీకి కోరాల్సి ఉంటుంది. జడ్జి 15 రోజుల వరకు కస్టడీకి (పోలీస్ లేదా జ్యుడీషియల్) అప్పగిస్తారు.

- Advertisement -

కేసు తీవ్ర‌త‌ను బ‌ట్టి గ‌డువు పొడిగింపు..

ఆ గడువులోగా కూడా విచారణ పూర్తికాకుంటే కేసు తీవ్రతను బట్టి కస్టడీ గడువును జడ్జి పొడిగిస్తారు. మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదా కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నకేసుల్లో కస్టడీ గడువు గరిష్ఠంగా 90 రోజులు.. మిగతా కేసుల విషయంలో.. దర్యాఫ్తు అధికారి.. సంస్థ మరో అత్యవసర కేసును కూడా విచారిస్తుంటే గరిష్ఠంగా 60 రోజుల కస్టడీ విధించవచ్చు. ఈ గడువు పూర్తయినా కూడా కేసు విచారణ కంప్లీట్ కాని సందర్భంలో నిందితులు పొందే చట్టబద్దమైన హక్కునే డిఫాల్ట్ బెయిల్ అంటారు. కవిత కేసుకు సంబంధించి ఈ గడువు పూర్తవడంతో ఆమె తరఫున లాయర్లు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచార‌ణ‌ను ఈ నెల 12వ తేదికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement